Share News

ఫార్చ్యూన్‌ 40 అండర్‌ 40 లిస్ట్‌లో అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ హర్షద్‌ రెడ్డి

ABN , Publish Date - May 12 , 2024 | 02:59 AM

భారత పారిశ్రామిక రంగంలోని వర్ధమాన నాయకులకు (40 ఏళ్ల లోపు వారు) సంబంధించి ఫార్చ్యూన్‌ ఇండియా మేగజైన్‌ ఈ ఏడాదికి గాను ‘40 అండర్‌ 40’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది...

ఫార్చ్యూన్‌ 40 అండర్‌ 40 లిస్ట్‌లో అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ హర్షద్‌ రెడ్డి

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగంలోని వర్ధమాన నాయకులకు (40 ఏళ్ల లోపు వారు) సంబంధించి ఫార్చ్యూన్‌ ఇండియా మేగజైన్‌ ఈ ఏడాదికి గాను ‘40 అండర్‌ 40’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ హర్షద్‌ రెడ్డికి ఈ జాబితాలో చోటు దక్కింది. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ (రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌), కుమార్తె ఇషా అంబానీ (రిలయన్స్‌ రిటైల్‌ డైరెక్టర్‌)తోపాటు అల్లుడు ఆనంద్‌ పిరామల్‌ (పిరామల్‌ గ్రూప్‌ ఈడీ)కు కూడా ఈ లిస్ట్‌లో స్థానం లభించింది. అంతేకాదు, గౌతమ్‌ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్‌ ఎండీ కరణ్‌ అదానీ, కుమార మంగళం బిర్లా కూతురు, స్వతంత్ర మైక్రోఫైనాన్స్‌ చైర్మన్‌ అనన్య బిర్లా సైతం జాబితాలో ఉన్నారు.

Updated Date - May 12 , 2024 | 02:59 AM