రూ.2000 కోట్లతో అన్విత ఇవానా
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:22 AM
రియల్టీ రంగంలోని అన్విత గ్రూప్ హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద నిర్మిస్తున్న భారీ హౌసింగ్ ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తి కాబోతోంది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అన్విత చేపట్టింది. తొలిదశలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో...

నగరంలో మరో భారీ హౌసింగ్ ప్రాజెక్టు
హైదరాబాద్: రియల్టీ రంగంలోని అన్విత గ్రూప్ హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద నిర్మిస్తున్న భారీ హౌసింగ్ ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తి కాబోతోంది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అన్విత చేపట్టింది. తొలిదశలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తులుండే రెండు టవర్ల నిర్మాణం పూర్తవుతోందని, డిసెంబరు నాటికి యజమానులకు ఫ్లాట్లు అందచేస్తామని కంపెనీ సీఎండీ బొప్పన అచ్యుతరావు తెలిపారు. రెండో దశలో 9.25 ఎకరాల్లో 36 అంతస్తులతో నాలుగు టవర్లు నిర్మించనున్నట్టు చెప్పారు. అపార్ట్‌మెంట్లలో నివశించే వృద్ధులు, పిల్లల కోసం రెండు క్లబ్ హౌస్‌లు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మిస్తున్నట్టు కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన తెలిపారు. వృద్ధులు, చిన్నారులను గాడ్జెట్ల నుంచి గార్డెన్‌కు ఆకర్షించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అపార్ట్‌మెంట్లలో నివశిస్తున్న వారెవరైనా మరణిస్తే బంధుమిత్రులు వచ్చే వరకు పార్థివ దేహాన్ని కాపాడేందుకు అవసరమైన మూడు బాడీలు ఉంచగల ఫ్రీజర్ వ్యవస్థ కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నామని అచ్యుతరావు చెప్పారు.