ఎస్‌బీఐలో మరో తెలుగు తేజం
ABN , Publish Date - Sep 03 , 2024 | 05:43 AM
దేశీయ బ్యాంకిం గ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)లో కీలక పదవికి మరో తెలుగు తేజం ఎంపియ్యారు. ఆంధ్రప్రదేశ్, బాపట్లకు చెందిన రామ మోహన రావు అమర.. బ్యాం క్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఆర్థిక సంస్థల
ఎండీగా రామ మోహన రావు నియామకం
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకిం గ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)లో కీలక పదవికి మరో తెలుగు తేజం ఎంపియ్యారు. ఆంధ్రప్రదేశ్, బాపట్లకు చెందిన రామ మోహన రావు అమర.. బ్యాం క్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఆర్థిక సంస్థల కీలక పదవులకు అభ్యర్ధులను ఎంపిక చేసే ‘ది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ) మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి రామ మోహన రావు పేరును ఎంపిక చేసింది. ఈ సిఫారసును కేంద్ర క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్‌బీఐ ఎండీగా ఉన్న మరో తెలుగు తేజం సీ శ్రీనివాసులు శెట్టి ఇటీవలే ఎస్‌బీఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో రామ మోహన రావు బ్యాంక్ ఎండీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రావు 1991లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఎస్‌బీఐలో చేరారు. తన 32 సంవత్సరాల సర్వీసులో దేశ, విదేశాల్లోని ఎస్‌బీఐ శాఖల్లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. భారత బ్యాంకింగ్ రంగంలో రారాజుగా భావించే ఎస్‌బీఐ చరిత్రలో రెండు కీలక పదవులకు ఇరువురు తెలుగు వారు ఒకేసారి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.