ఆంధ్రా షేర్లు జిగేల్
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:35 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు వరుసగా నాలుగో రోజూ లాభపడింది. బీఎ్‌సఈలో...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు వరుసగా నాలుగో రోజూ లాభపడింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు మరో 10 శాతం పెరిగి సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి రూ.601.60 వద్ద ముగిసింది. అలాగే, టీడీపీ మాజీ ఎంపీ జయదేవ్ గల్లాకు చెంది న అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ షేరు ఇంట్రాడేలో మరో 10 శాతం ఎగబాకి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,332.75 వద్దకు చేరుకుంది. చివరికి 4.91 శాతం లాభంతో రూ.1,275.65 వద్ద క్లోజైంది. ఏపీలో సిమెంట్ ప్లాంట్ కలిగిన కేసీపీ లిమిటెడ్ షేరు ఇంట్రాడేలో 19 శాతం వరకు పెరిగి రూ.238.70 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసింది.
చివరికి 8.82 శాతం లాభంతో రూ.219.60 వద్ద స్థిరపడింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. అవంతీ ఫీడ్స్ 7.99 శాతం, ఆంధ్రా సిమెంట్స్ 3.23 శాతం, ఆంధ్రా పెట్రోకెమికల్స్ 6.89 శాతం, ఆంధ్రా షుగర్స్ 2.72 శాతం, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ 3.89 శాతం పెరిగాయి.