ఇక ఫ్లిప్‌కార్ట్ ద్వారా నగదు బదిలీ
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:56 AM
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇక అందరూ యూపీఐ చెల్లింపులు కూడా చేయవచ్చు.
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇక అందరూ యూపీఐ చెల్లింపులు కూడా చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ హ్యాండిల్ ఃజజ్చ్ఠుజీట ద్వారా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లతో పాటు ఎవరైనా రిజిస్టర్ అయి తేలిగ్గా యూపీఐ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇది దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానం మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు 50 కోట్ల మందితో పాటు సాధారణ పౌరులు కూడా దీనిలో రిజిస్టర్ కావచ్చు. ఇది ఉపయోగించే వారికి లాయల్టీలు అందించడం కోసం సూపర్ కాయిన్లు, క్యాష్‌బాక్‌లు, మైల్‌స్టోన్ ప్రయోజనాలు, బ్రాండ్ ఓచర్లు ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెడుతోంది. 2023లో 11,700 కోట్ల లావాదేవీల ద్వారా రూ.182.84 లక్షల కోట్ల చెల్లింపులు చేయడానికి యూపీఐ ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో యూపీఐ మరింతగా విస్తరించేందుకు ఫ్లిప్‌కార్ట్ హ్యాండిల్ ఉపయోగపడుతుందంటున్నారు.