Share News

అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:51 AM

మామూలుగానే పెళ్లంటే ఎక్కడ లేని హడావుడి ఉంటుంది. ఇక ఆసియా కుబేరుని కుమారుని వివాహం అంటే మాటలా...?

అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ

ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు

న్యూఢిల్లీ: మామూలుగానే పెళ్లంటే ఎక్కడ లేని హడావుడి ఉంటుంది. ఇక ఆసియా కుబేరుని కుమారుని వివాహం అంటే మాటలా...? వాస్తవానికి ఇప్పుడు జరగబోయేది వివాహం కూడా కాదు, ప్రీ-వెడ్డింగ్‌ వేడుక మాత్రమే. అదెవరో కాదు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీది. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్‌ వివాహం జూలైలో జరగనుంది. ఆ వివాహానికి కొద్ది నెలల ముందుగానే మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రీ-వెడ్డింగ్‌ వేడుక నిర్వహిస్తున్నారు. ప్రపంచ పారిశ్రామిక, వ్యాపార, క్రీడా, సినిమా రంగాల దిగ్గజాలను ఈ వేడుకకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం రిలయన్స్‌ అతిపెద్ద రిఫైనరీ ఉన్న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరగబోతోంది. ముంబై నుంచి అతిథులను జామ్‌నగర్‌కు తరలించేందుకు చార్టర్డ్‌ విమానాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఆహ్వానాలు పంపిన పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజాల్లో మార్క్‌ జుకర్‌బర్గ్‌, బిల్‌ గేట్స్‌, సుందర్‌ పిచాయ్‌, శంతను నారాయణ్‌, బాబ్‌ ఐగర్‌, లారీ ఫింక్‌ (బ్లాక్‌రాక్‌), సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబేర్‌ (అద్నాక్‌), ఈఎల్‌ రోత్‌షిల్డ్‌ (లిన్‌ ఫారెస్టర్‌ రోత్‌ షిల్డ్‌ చైర్మన్‌), గౌతమ్‌ అదానీ కుటుంబం, ఎన్‌ చంద్రశేఖరన్‌, కుమార మంగళం బిర్లా కుటుంబం, గోద్రెజ్‌ కుటుంబం, నందన్‌ నీలేకని, సంజీవ్‌ గోయెంకా, రిషద్‌ ప్రేమ్‌జీ ఉన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 03:51 AM