Share News

మార్కెట్లలో ఆగని పతనం

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:35 AM

అమెరికాలో వడ్డీ రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గుతాయన్న ఆశలు ఆవిరైపోవడంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పెరిగిన అమ్మకాల కారణంగా...

మార్కెట్లలో ఆగని పతనం

సెన్సెక్స్‌ 455 పాయింట్లు డౌన్‌

ముంబై: అమెరికాలో వడ్డీ రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గుతాయన్న ఆశలు ఆవిరైపోవడంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పెరిగిన అమ్మకాల కారణంగా ఈక్విటీ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా భారీ నష్టాలకు గురయ్యాయి. ఇటీవల ర్యాలీని సొమ్ము చేసుకునేందుకు ఇన్వెస్టర్లు గత కొద్ది రోజులుగా భారీ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా సెన్సెక్స్‌ గురువారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఇంట్రాడేలో గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు నడుమ 1,107.38 పాయింట్ల మేరకు ఊగిసలాడింది. మిడ్‌సెషన్‌లో అయితే కేవలం మూడు నిమిషాల వ్యవధితో 319 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్‌ 454.69 పాయింట్ల నష్టంతో 72,488.99 వద్ద క్లోజైంది. నిఫ్టీ 152.05 పాయింట్ల నష్టంతో 21,961.70 వద్ద ముగిసింది. నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 2,549.16 పాయింట్లు నష్టపోయింది. ఫలితంగా బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.9,30,304.76 పాయింట్లు దిగజారి రూ.3,92,89,048.31 కోట్లకు పడిపోయింది.

జెఎన్‌కే షేరు ధర శ్రేణి రూ.395-415: హీటింగ్‌ పరికరాలు తయారుచేసే జేఎన్‌కే ఇండియా లిమిటెడ్‌ రూ.650 కోట్ల పబ్లిక్‌ ఇష్యూలో షేరు ధర శ్రేణిని గురువారం ప్రకటించింది. షేరు కనిష్ఠ ధర రూ.395 కాగా గరిష్ఠ ధర రూ.415గా నిర్ణయించింది. వచ్చే మంగళవారం ఇష్యూ ప్రారంభమై గురువారం ముగుస్తుంది.

Updated Date - Apr 19 , 2024 | 02:35 AM