మళ్ళీ 10,000 కోట్ల డాలర్ల క్లబ్‌లోకి అంబానీ
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:43 AM
స్టాక్ మార్కెట్ ర్యాలీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ 10,000 కోట్ల (100 బిలియన్) డాలర్ల క్లబ్‌లో చేరారు. గత రెండు రోజుల్లో...

ప్రపంచ సంపన్నుల్లో 11వ స్థానం
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ర్యాలీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ 10,000 కోట్ల (100 బిలియన్) డాలర్ల క్లబ్‌లో చేరారు. గత రెండు రోజుల్లో ఆర్‌ఐఎల్ షేరు 5.4 శాతం లాభంతో రూ.2,718.40కి చేరాయి. గురువారం ఒక దశలో ఆర్‌ఐఎల్ షేరు రూ.2,724.95 జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకింది. దీంతో ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ.18 లక్షల కోట్లకు చేరింది. గత వారం రోజుల్లో అంబానీ నిర్వహణలోని నెట్‌వర్క్ 18, టీవీ18 బ్రాడ్‌కాస్ట్ కంపెనీల షేర్లు 24 నుంచి 45 శాతం పెరిగాయి. దీంతో అంబానీ నికర సంపద 10,501 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8.71 లక్షల కోట్లు) చేరింది. 2021 తర్వాత అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఇదే మొదటిసారి. వంద బిలియన్ డాలర్లకుపైగా నికర సంపద ఉన్న కుబేరులు ప్రపంచంలో 12 మంది ఉంటే అందులో అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.