Share News

వయాకామ్‌18- స్టార్‌ ఇండియా విలీనానికి అనుమతివ్వండి

ABN , Publish Date - May 26 , 2024 | 05:05 AM

వయాకామ్‌ 18- స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐపీఎల్‌) విలీన ఒప్పందాన్ని ఆమోదించాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కోరింది...

వయాకామ్‌18- స్టార్‌ ఇండియా విలీనానికి  అనుమతివ్వండి

సీసీఐని కోరిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

న్యూఢిల్లీ: వయాకామ్‌ 18- స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐపీఎల్‌) విలీన ఒప్పందాన్ని ఆమోదించాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కోరింది రిలయన్స్‌ గ్రూప్‌లో భాగమైన వయాకామ్‌ 18కు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యాపారంతో వాల్ట్‌ డిస్నీకి చెందిన ఎస్‌ఐపీఎల్‌ విలీనం కానుంది. విలీనం తర్వాత ఏర్పడే సంస్థ పలు భాషల్లో కలిపి 100కు పైగా టీవీ చానళ్లు, రెండు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 75 కోట్ల వీక్షకులతో దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించనుంది. విలీన సంస్థలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, దాని అనుబంధ విభాగాలు 63.16 శాతం, డిస్నీ 36.84 శాతం వాటా కలిగి ఉంటాయి.

Updated Date - May 26 , 2024 | 05:05 AM