ఆద్యంతం ఒడుదుడుకులే..
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:57 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 370 పాయింట్ల వరకు ఎగిసింది...

స్వల్ప నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 370 పాయింట్ల వరకు ఎగిసింది. కానీ, చివరివరకు లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. ఆఖరి గంటలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడటంతో సెన్సెక్స్ 33.49 పాయింట్ల నష్టంతో 76,456.59 వద్దకు జారుకుంది. నిఫ్టీ మాత్రం 5.65 పాయింట్ల లాభంతో 23,264.85 వద్ద స్థిరపడింది.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ ఓకే
విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఆఫరింగ్‌లో భాగంగా కంపెనీ రూ.5,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన రూ.1,750 కోట్ల విలువైన 9.519 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉంది. అంటే, ఐపీఓ ద్వారా సంస్థ మొత్తం రూ.7,250 కోట్ల వరకు సమీకరించనుంది.