Share News

పబ్లిక్‌ ఇష్యూకు అకుమ్స్‌ డ్రగ్స్‌

ABN , Publish Date - Feb 12 , 2024 | 04:45 AM

అకుమ్స్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ.680 కోట్ల విలువైన...

పబ్లిక్‌ ఇష్యూకు అకుమ్స్‌ డ్రగ్స్‌

న్యూఢిల్లీ: అకుమ్స్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ.680 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు 1.86 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఓఎ్‌ఫఎస్‌ ద్వారా ప్రమోటర్లు సంజీవ్‌ జైన్‌, సందీప్‌ జైన్‌, రూబీ క్యూసీ ఇన్వె్‌స్టమెంట్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్‌ తమ వాటాలను విక్రయించనున్నట్లు సెబీకి సమర్పించిన డీఆర్‌హెచ్‌పీలో కంపెనీ వెల్లడించింది. కాగా ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా కంపెనీ రూ.136 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపుతో పాటు మూలధన అవసరాల నిమిత్తం వినియోగించనుంది.

గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ కూడా..: ఫ్లోట్‌ గ్లాస్‌ తయారీదారు గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూ ద్వారా కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయటంతో పాటు ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు 1.56 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 04:45 AM