Share News

జీఓసీఎల్‌ భూమి విక్రయానికి ఒప్పందం

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:58 AM

హిందూజా గ్రూప్‌ కంపెనీ జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో 264.50 ఎకరాల భూమి వ్యూహాత్మక మానిటైజేషన్‌కు సంబంధించి స్క్వేర్‌స్పేస్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో...

జీఓసీఎల్‌ భూమి విక్రయానికి ఒప్పందం

  • విలువ రూ.3402 కోట్లు

హైదరాబాద్‌: హిందూజా గ్రూప్‌ కంపెనీ జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో 264.50 ఎకరాల భూమి వ్యూహాత్మక మానిటైజేషన్‌కు సంబంధించి స్క్వేర్‌స్పేస్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ ద్వారా జీఓసీఎల్‌కు రూ.3402 కోట్లు లభిస్తాయి. ఇందులో భాగంగానే 32 ఎకరాల భూమిని హిందూజా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌తో (హెచ్‌హెచ్‌ఎల్‌) కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్నారు. 18 నెలల కాలంలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం పరిధిలోకి వచ్చే ఈ 32 ఎకరాల్లో 12.50 ఎకరాలను తక్షణం విక్రయిస్తారు. జీఓసీఎల్‌కు తొలి విడతగా లభించే రూ.520 కోట్లలో రూ.160 కోట్లు పైన పేర్కొన్న 12.50 ఎకరాల విక్రయం ద్వారా సమకూరుతుంది. మిగతా సొమ్ము దశలవారీగా అందుతుంది.

Updated Date - Mar 28 , 2024 | 01:58 AM