Share News

భెల్‌కు అదానీ భారీ ఆర్డర్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:54 AM

చత్తీ్‌సగఢ్‌లోని రాయపూర్‌లో నిర్మిస్తున్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాల కోసం అదానీ పవర్‌ లిమిటెడ్‌ నుంచి ప్రభుత్వ రంగంలోని భెల్‌కు భారీ ఆర్డర్‌ లభించింది...

భెల్‌కు అదానీ భారీ ఆర్డర్‌

న్యూఢిల్లీ: చత్తీ్‌సగఢ్‌లోని రాయపూర్‌లో నిర్మిస్తున్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాల కోసం అదానీ పవర్‌ లిమిటెడ్‌ నుంచి ప్రభుత్వ రంగంలోని భెల్‌కు భారీ ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ విలువ రూ.3500 కోట్లు. ఈ మేరకు ఉభయ సంస్థల మధ్య కాంట్రాక్టుపై బుధవారం సంతకాలు జరిగాయని భెల్‌ ఎక్స్ఛేంజిలకు పంపిన ప్రకటనలో తెలిపింది. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఆ 2 ్ఠ 800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు కోసం బాయిలర్‌, టర్బైన్‌, జనరేటర్లు తాము అందించాల్సి ఉంటుందని తెలియచేసింది.

Updated Date - Jun 06 , 2024 | 03:54 AM