Share News

అంబుజాలో అదానీ వాటా పెంపు

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:05 AM

అంబుజా సిమెంట్స్‌లో మరో రూ.8,339 కోట్ల పెట్టుబడి ద్వారా గౌతమ్‌ అదానీ కుటుంబం కంపెనీలో వాటాను 70.3 శాతానికి పెంచుకుంది....

అంబుజాలో అదానీ వాటా పెంపు

మరో రూ.8,339 కోట్ల పెట్టుబడితో 70.3 శాతానికి పెరిగిన వాటా

న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్స్‌లో మరో రూ.8,339 కోట్ల పెట్టుబడి ద్వారా గౌతమ్‌ అదానీ కుటుంబం కంపెనీలో వాటాను 70.3 శాతానికి పెంచుకుంది. గతంలోనూ అదానీ కుటుంబం 2022 అక్టోబరు 18న రూ.5,000 కోట్లు, 2024 మార్చి 28న రూ.6,661 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. తాజా ఇన్వె్‌స్టమెంట్‌తో కలిపి మొత్తం రూ.20,000 కోట్ల నిధులు సమకూర్చిందని అంబుజా సిమెంట్స్‌ వెల్లడించింది. తాజా ఇన్వె్‌స్టమెంట్‌ ద్వారా అంబుజాలో అదానీ ఫ్యామిలీ వాటా మరో 3.6 శాతం పెరిగింది. మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడి ద్వారా 63.2 శాతం నుంచి 70.3 శాతానికి చేరుకుంది. కంపెనీ సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2028 నాటికి రెట్టింపు స్థాయి 14 కోట్ల టన్నులకు పెంచుకునేందుకు దోహదపడనున్నాయి. గత డిసెంబరు 31 నాటికి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 7.61 కోట్ల టన్నులుగా ఉంది. స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్‌ దిగ్గజం హోల్సిమ్‌ నుంచి అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో మెజారిటీ వాటాను 1,050 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా 2022లో అదానీ గ్రూప్‌ సిమెంట్‌ తయారీ రంగంలోకి ప్రవేశించింది.

Updated Date - Apr 18 , 2024 | 06:05 AM