Share News

అపోలో హెల్త్‌లో రూ.103 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:21 AM

రైట్స్‌ ఇష్యూ ద్వారా తమ అనుబంధ సంస్థ అపోలో హెల్త్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌ఎల్‌ఎల్‌) ఈక్విటీలో 35,12,107 షేర్లను అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏహెచ్‌ఈఎల్‌) కొనుగోలు...

అపోలో హెల్త్‌లో రూ.103 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు

న్యూఢిల్లీ: రైట్స్‌ ఇష్యూ ద్వారా తమ అనుబంధ సంస్థ అపోలో హెల్త్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌ఎల్‌ఎల్‌) ఈక్విటీలో 35,12,107 షేర్లను అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏహెచ్‌ఈఎల్‌) కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుకు రూ.284 ప్రీమి యం చెల్లించనుంది. ఇందుకు మొత్తం రూ.103 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. 2000లో ఏర్పాటైన ఏహెచ్‌ఎల్‌ఎల్‌.. ప్రత్యేక ఆస్పత్రులు, మెటర్నిటీ ఆస్పత్రులు, షుగర్‌, డెంటల్‌ క్లినిక్‌లు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, డయాలసిస్‌ కేందాల్ర ద్వారా సమగ్ర వైద్య సేవలు అందిస్తోంది.

Updated Date - Jul 08 , 2024 | 06:21 AM