Share News

టెక్‌ వ్యూ 22600 పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి

ABN , Publish Date - Apr 08 , 2024 | 05:53 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రా రంభమై 22500 వద్ద రియాక్షన్‌కు గురైనప్పటికీ తిరిగి కోలుకుంది. చివ రికి ముందు వారంతో పోల్చితే 185 పాయింట్ల లాభంతో 22500 సమీపం లో క్లోజయింది. గత నాలుగు వారాలు గా...

టెక్‌ వ్యూ 22600 పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి

టెక్‌ వ్యూ 22600 పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రా రంభమై 22500 వద్ద రియాక్షన్‌కు గురైనప్పటికీ తిరిగి కోలుకుంది. చివ రికి ముందు వారంతో పోల్చితే 185 పాయింట్ల లాభంతో 22500 సమీపం లో క్లోజయింది. గత నాలుగు వారాలు గా నిఫ్టీ ఇక్కడ పరీక్ష ఎదుర్కొంటూనే ఉంది. ఈ విడత కూడా మైనర్‌ రియాక్షన్‌ అనంతరం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కు కోవడం తక్షణ ముప్పు లేదనేందుకు సంకేతం. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్వల్పకాలిక నిరోధాన్ని బ్రేక్‌ చేయడం అవ సరం. గత వారం మిడ్‌క్యాప్‌ 100 సూచీ 1950 పాయింట్లు లాభపడి చారి త్రక గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. స్మాల్‌క్యాప్‌ 100 సూచీ కూడా 1100 పాయింట్లు లాభపడి చారిత్రక గరిష్ఠ స్థాయి వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మార్కెట్‌ ఐదో సారి చారిత్రక గరిష్ఠ స్థాయి 22550 వద్ద పరీక్షకు గురవుతోంది.

బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ధోరణిలో ట్రేడయినట్టయితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం గత శుక్రవారం తాకిన ప్రధాన నిరోధం 22600 కన్నా నిలదొక్కుకోవాలి. ఆ పైన మానసిక అవధులు 22800, 23000.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా సానుకూలత కోసం 22500 వద్ద నిలదొక్కుకుని తీరాలి. అంత కన్నా దిగజారితే మైనర్‌ బలహీనతలో పడుతుంది. మరో మద్దతు స్థాయి 22300. ప్రధాన మద్దతు స్థాయిలు 22150, 21950.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం మంచి ర్యాలీ సాధించి 1370 పాయింట్ల లాభంతో 48,500 వద్ద క్లోజయింది. పాజిటివ్‌ ధోరణిలో ట్రేడ యినట్టయితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 48650 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన మానసిక అవధి 49000. దిగువన మద్ద తు స్థాయి 48000 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది.

పాటర్న్‌: సానుకూలత కోసం 22600 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన ట్రెండ్‌లైన్‌’’ను బ్రేక్‌ చేయాలి. 22300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 22600, 22640

మద్దతు : 22460, 22400

వి. సుందర్‌ రాజా

Updated Date - Apr 08 , 2024 | 05:53 AM