Share News

చల్లారిన ధరల మంట

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:41 AM

సగటు జీవికి ధరల మంట నుంచి జనవరిలో కొంత ఉపశమనం లభించింది. జనవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్ఠస్థాయి...

చల్లారిన ధరల మంట

జనవరిలో ద్రవ్యోల్బణం 5.1%

3 నెలల కనిష్ఠం

న్యూఢిల్లీ: సగటు జీవికి ధరల మంట నుంచి జనవరిలో కొంత ఉపశమనం లభించింది. జనవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్ఠస్థాయి. కూరగాయలు, పళ్లు, ఇతర ఆహార వస్తువుల ధరలు అదుపులోకి రావడం ఇందుకు దోహదపడింది. గత ఏడాది అక్టోబరులో 4.9 శాతానికి దిగివచ్చిన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుతూ డిసెంబరులో 5.69 శాతానికి చేరింది. కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం జనవరి నెలలో ఆహార ద్రవ్యోల్బణం డిసెంబరుతో పోల్చితే 9.53 శాతం నుంచి 8.3 శాతానికి దిగివచ్చింది. ప్రాంతాలవారీగా చూసినట్టయితే పట్టణ ప్రాంతాల్లో ధరల కాటు అధికంగా 9.02 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 7.91 శాతం ఉంది. గత ఏడాది జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం ఉంది.

Updated Date - Feb 13 , 2024 | 06:45 AM