మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:47 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్, వాహన రంగాలకు చెందిన కొన్ని కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో...

దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్, వాహన రంగాలకు చెందిన కొన్ని కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 110.64 పాయింట్లు కోల్పోయి 73,903.91 వద్దకు జారుకుంది. ఇంట్రాడేలోనైతే సూచీ 270 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ.. ఆఖరి గంటలో నష్టాలను సగానికి పైగా తగ్గించుకోగలిగింది. నిఫ్టీ 8.70 పాయింట్ల నష్టంతో 22,453.30 వద్ద క్లోజైంది.