కొత్తగా 81 లక్షల ఎంఎఫ్ ఖాతాలు
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:07 AM
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పథకాలపై మదుపరుల అవగాహన పెరుగుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో 81 లక్షల మంది మదుపరులు...

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పథకాలపై మదుపరుల అవగాహన పెరుగుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో 81 లక్షల మంది మదుపరులు కొత్తగా ఎంఎఫ్ ఖాతాలు ప్రారంభించారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎంఎఫ్ రుణ పథకాలపై అధిక రాబడులు లభించడం, ఎంఎఫ్‌ల మార్కెటింగ్, సెలబ్రిటీలతో ప్రచారం, విస్తృత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఇందుకు ప్రధాన కారణమని స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ సీఓఓ డీ త్రివేష్ చెప్పారు. ప్రస్తుత బుల్‌రన్‌తో ముందు ముందూ ఎంఎఫ్ పథకాల్లో మదుపరుల పెట్టుబడులు కొనసాగుతాయని మార్కెట్ వర్గాల అంచనా.