Share News

అపోలో హాస్పిటల్స్‌ లాభంలో 76 శాతం వృద్ధి

ABN , Publish Date - May 31 , 2024 | 01:37 AM

గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 76 శాతం వృద్ధితో....

అపోలో హాస్పిటల్స్‌ లాభంలో 76 శాతం వృద్ధి

ఒక్కో షేరుకు 200 శాతం డివిడెండ్‌ సిఫారసు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 76 శాతం వృద్ధితో రూ.254 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.144 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రెవెన్యూ కూడా రూ.4,302 కోట్ల నుంచి రూ.4,944 కోట్లకు పెరిగింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రెవెన్యూ రూ.16,612 కోట్ల నుంచి రూ.19,059 కోట్లకు, లాభం రూ.819 కోట్ల నుంచి రూ.899 కోట్లకు పెరిగింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.10 (200 శాతం) తుది డివిడెండ్‌ను అపోలో డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

Updated Date - May 31 , 2024 | 01:37 AM