Share News

రూ.6,785 కోట్ల ఇండిగో షేర్లు

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:03 AM

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మాతృసంస్థ ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ సంస్థలో 5.83 శాతం వాటాకు సమానమైన 2.25 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.6,785 కోట్లకు విక్రయించారు...

రూ.6,785 కోట్ల ఇండిగో షేర్లు

విక్రయించిన గంగ్వాల్‌

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మాతృసంస్థ ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ సంస్థలో 5.83 శాతం వాటాకు సమానమైన 2.25 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.6,785 కోట్లకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో బ్లాక్‌ డీల్స్‌ ద్వారా ఈ షేర్ల విక్రయం జరిగింది. తన సహ ప్రమోటర్‌ రాహుల్‌ భాటియాతో వివాదం నేపథ్యంలో గంగ్వాల్‌ 2022 ఫిబ్రవరిలో కంపెనీ బోర్డు నుంచి తప్పుకున్నారు. అలాగే, కంపెనీలో తన వాటాను వచ్చే ఐదేళ్లలో క్రమంగా తగ్గించుకోనున్నట్లు ప్రకటించారు. అదే నెలలో రాకేశ్‌ గంగ్వాల్‌ భార్య శోభ గంగ్వాల్‌ కంపెనీలో 4 శాతం వాటాను రూ.2,944 కోట్లకు, 2023 ఆగస్టులో మరో 2.9 శాతం వాటాను రూ.2,800 కోట్లకు విక్రయించారు. కాగా, 2022 సెప్టెంబరులో దంపతులిద్దరు కలిసి 2.74 శాతం వాటాను రూ.2,005 కోట్లకు విక్రయించారు. బీఎ్‌సఈలో కంపెనీ షేరు ధర సోమవారం 3.63 శాతం పెరిగి రూ.3,214.25 వద్ద ముగిసింది.

Updated Date - Mar 12 , 2024 | 05:03 AM