Share News

కోటక్‌ బ్యాంక్‌ లాభంలో 6.75% వృద్ధి

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:22 AM

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3)లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.75 శాతం వృద్ధితో రూ.4,264.78 కోట్లకు చేరుకుంది. స్టాండ్‌ఎలోన్‌ లాభం మాత్రం రూ.3,005.01 కోట్లుగా నమోదైంది...

కోటక్‌ బ్యాంక్‌ లాభంలో 6.75% వృద్ధి

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3)లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.75 శాతం వృద్ధితో రూ.4,264.78 కోట్లకు చేరుకుంది. స్టాండ్‌ఎలోన్‌ లాభం మాత్రం రూ.3,005.01 కోట్లుగా నమోదైంది. కాగా, సమీక్షా కాలానికి బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 16 శాతం వృద్ధి చెంది రూ.6,554 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ రుణాలు 19 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. కాగా, నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 5.22 శాతానికి తగ్గింది. ఇతర ఆదాయం రూ.2,297 కోట్లకు ఎగబాకింది. డిపాజిట్లలో 18 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. అయితే, తక్కువ వ్యయంతో సమీకరించిన డిపాజిట్ల వాటా 47 శాతానికి తగ్గిందని, అధిక వడ్డీల కాలంలో తక్కువ వ్యయానికే డిపాజిట్ల సమీకరణ సవాలుగా మారిందని బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన మూడు నెలల్లో రూ.1,177 కోట్ల విలువైన రుణాలు మొండి బాకీల పద్దులోకి చేరాయని, అందులో చాలావరకు తనఖా లేని రుణాలేనని బ్యాంక్‌ శాశ్వత డైరెక్టర్‌ కేవీఎస్‌ మణియన్‌ తెలిపారు. బ్యాంక్‌లో వీటి వాటా 11 శాతానికి చేరుకుంది. కాగా, డిసెంబరు చివరినాటికి మొండి బకా యిలు లేదా స్థూల నిరర్థక ఆస్తుల (గ్రాస్‌ ఎన్‌పీఏ) నిష్పత్తి 1.73 శాతంగా నమోదైంది. కార్పొరేట్‌ రుణ విభాగ వృద్ధి కూడా 13 శాతానికి తగ్గింది.

Updated Date - Jan 21 , 2024 | 02:22 AM