పిట్టీ ఇంజనీరింగ్ లాభంలో 62% వృద్ధి
ABN , Publish Date - May 17 , 2024 | 04:19 AM
పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.40.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...
హైదరాబాద్: పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.40.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.2.4.84 కోట్లు)తో పోల్చితే నికర లాభం 62.42 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.263.31 కోట్ల నుంచి రూ.359.32 కోట్లకు పెరిగింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.5 విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసిం ది.మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.1,249.81 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.90.20 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.