Share News

ఎన్‌ఎండీసీ లాభంలో 62% వృద్ధి

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:57 AM

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,469.73 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.903.89 కోట్లు)తో...

ఎన్‌ఎండీసీ లాభంలో 62% వృద్ధి

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,469.73 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.903.89 కోట్లు)తో పోల్చితే లాభం 62 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయాలు కూడా రూ.3,924.75 కోట్ల నుంచి రూ.5,746.47 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో మొత్తం వ్యయాలు కూడా రూ.2,693.01 కోట్ల నుంచి రూ.3,516.78 కోట్లకు పెరిగాయి. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.5.75 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. డివిడెండ్‌ చెల్లింపునకు రికార్డు తేదీగా ఫిబ్రవరి 27ను ఖరారు చేసింది.

Updated Date - Feb 15 , 2024 | 06:44 AM