Share News

4 రోజుల్లో 5.12 లక్షల కోట్లు ఆవిరి

ABN , Publish Date - May 30 , 2024 | 02:25 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితితోపాటు అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను కొనసాగించడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు...

4 రోజుల్లో 5.12 లక్షల కోట్లు ఆవిరి

8 సెన్సెక్స్‌ 668 పాయింట్లు పతనం

8 75,000 స్థాయిని కోల్పోయిన సూచీ

8 5 లక్షల కోట్ల డాలర్ల దిగువకు బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌

ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితితోపాటు అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను కొనసాగించడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ మరో 667.55 పాయింట్లు పతనమై 74,502.90 వద్దకు జారుకుంది. దాంతో సూచీ 75,000 కీలక స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ 183.45 పాయింట్లు కోల్పోయి 22,704.70 వద్ద క్లోజైంది. గడిచిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.12 లక్షల కోట్లకు పైగా క్షీణించి రూ.415.09 లక్షల కోట్లకు (4.98 లక్షల కోట్ల డాల ర్లు) జారుకుంది. ఫెడ్‌ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లుతుండటం అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ ప్రతికూలంగా మారిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.


వెండి సరికొత్త రికార్డు

రూ.1.02 లక్షలకు కిలో ధర

దేశీయంగా విలువైన లోహాల ధరలు మరింత ఎగబాకాయి. వెండి సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్‌ రూ.1,000 పెరిగి రూ.1.02 లక్షలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.270 పెరుగుదలతో రూ.73,200కు ఎగబాకింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ కామెక్స్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒకదశలో 2,352 డాలర్లు, సిల్వర్‌ 32.05 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

Updated Date - May 30 , 2024 | 02:25 AM