Share News

Cars24 : ఈ ఏడాది యూజ్డ్‌ కార్ల ఫైనాన్సింగ్‌లో 35 శాతం వృద్ధి

ABN , Publish Date - May 25 , 2024 | 05:54 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) హైదరాబాద్‌ మార్కెట్లో యూజ్డ్‌ కార్ల ఫైనాన్సింగ్‌లో 35 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు కార్స్‌24 అనుబంధ సంస్థ కార్స్‌24 ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీఎ్‌ఫఎ్‌సపీఎల్‌)

Cars24 : ఈ ఏడాది యూజ్డ్‌ కార్ల ఫైనాన్సింగ్‌లో 35 శాతం వృద్ధి

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) హైదరాబాద్‌ మార్కెట్లో యూజ్డ్‌ కార్ల ఫైనాన్సింగ్‌లో 35 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు కార్స్‌24 అనుబంధ సంస్థ కార్స్‌24 ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీఎ్‌ఫఎ్‌సపీఎల్‌) వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో రుణాల మంజూరులో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కార్స్‌24 సహ వ్యవస్థాపకుడు గజేంద్ర జంగిద్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి మొత్తం రూ.500 కోట్ల వరకు రుణాలు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో యూజ్డ్‌ కార్లు కొనుగోలు చేసిన వారిలో 69 శాతం మంది సీఎ్‌ఫఎ్‌సపీఎల్‌ నుంచి రుణం తీసుకున్నారని తెలిపారు. యూజ్డ్‌ కార్లలో హ్యాచ్‌బ్యాక్‌ కార్లయిన హ్యుండయ్‌ ఎలైట్‌ ఐ20, హ్యుండయ్‌ గ్రాండ్‌ ఐ10, మారుతి సుజుకీ బాలెనోకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. హైదరాబాద్‌లో సగటున నెలకు 1,000 కార్ల ను విక్రయించినట్లు గజేంద్ర చెప్పారు. హ్యాచ్‌బ్యాక్‌ కార్ల తర్వాత ఎస్‌యూవీల కొనుగోలుకు కొనుగోలుదారులు మక్కువ చూపిస్తున్నారన్నారు. తెలంగాణలోని 10కి పట్టణాల్లో కార్స్‌24 కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. వినియోగదారుల ప్రొఫైల్‌ ఆధారంగా 80 నుంచి 100 శాతం వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - May 25 , 2024 | 05:55 AM