Share News

2023లో కొత్తగా 3.1 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:18 AM

గత ఏడాదిలో కొత్తగా 3.1 కోట్లకు పైగా డీమ్యాట్‌ ఖాతాలు తెరిచారు. స్టాక్‌ మార్కెట్లో రికార్డుల ర్యాలీతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీ షేర్లలో పెట్టుబడులు భారీ రిటర్నులు పంచుతుండటం, పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)ల జోరు...

2023లో కొత్తగా 3.1 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు

మొత్తం 13.92 కోట్లకు పెరిగిన అకౌంట్స్‌

ముంబై: గత ఏడాదిలో కొత్తగా 3.1 కోట్లకు పైగా డీమ్యాట్‌ ఖాతాలు తెరిచారు. స్టాక్‌ మార్కెట్లో రికార్డుల ర్యాలీతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీ షేర్లలో పెట్టుబడులు భారీ రిటర్నులు పంచుతుండటం, పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)ల జోరు వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. గత 12 నెలల్లో సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(సీఎ్‌సడీఎల్‌), నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సడీఎల్‌) నిర్వహణలోని మొత్తం డీమ్యాట్‌ ఖాతాలు 28.7 శాతం వార్షిక వృద్ధితో 13.92 కోట్లకు చేరుకున్నాయి. 2022 చివరినాటికి అకౌంట్స్‌ 10.81 కోట్లుగా ఉన్నాయి. కాగా, 2023 డిసెంబరులో కొత్తగా 41 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు తెరిచారు. డీమ్యాట్‌ ఖాతాల్లో ఇప్పటివరకిదే అత్యధిక నెలవారీ జోడింపు. గత సంవత్సరం స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు రెండంకెల రిటర్నులు పంచాయి. నిఫ్టీ-50 సూచీ 20 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 46.6 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 55.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Updated Date - Jan 07 , 2024 | 03:18 AM