Share News

టాటా స్టీల్‌ యూకే యూనిట్‌లో 2,500 మంది ఔట్‌!

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:10 AM

టాటా స్టీల్‌ యూకే యూనిట్‌లో కొలువుల కోత తప్పదని కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్‌ స్పష్టం చేశారు. దాదాపు 2,500 మంది ఉద్యోగులను తీసివేయాల్సి ఉంటుందని...

టాటా స్టీల్‌ యూకే యూనిట్‌లో 2,500 మంది ఔట్‌!

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ యూకే యూనిట్‌లో కొలువుల కోత తప్పదని కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్‌ స్పష్టం చేశారు. దాదాపు 2,500 మంది ఉద్యోగులను తీసివేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సౌత్‌ వేల్స్‌లోని పోర్టు టాల్‌బాట్‌లో టాటా స్టీల్‌ ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీని నడుపుతోంది. బ్రిటన్‌లో ఇదే అతి పెద్ద స్టీల్‌ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో దాదాపు 8,000 మంది పని చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా టాటా స్టీల్‌ ఈ ఫ్యాక్టరీలో సాధారణ బ్లాస్ట్‌ ఫర్నే్‌సలు తొలగించి ఎలక్ట్రిక్‌ ఆర్క్‌ ఫర్నే స్‌లు ఏర్పాటు చేస్తోంది. ఈ కారణంగా 2,500 మంది ఉద్యోగులను తీసివేయాల్సి వస్తోంది. అయితే కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 06:10 AM