మార్కెట్ సంపదలో రూ.2.5 లక్షల కోట్ల వృద్ధి
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:44 AM
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఒక దశలో 518 పాయింట్లు ఎగబాకి 81,000 స్థాయికి చేరువైన సెన్సెక్స్.. చివరికి 378.18 పాయింట్ల లాభంతో 80,802.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126.20 పాయింట్ల వృద్ధితో...
రూ.456.7 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్
సెన్సెక్స్ 378 పాయింట్లు అప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఒక దశలో 518 పాయింట్లు ఎగబాకి 81,000 స్థాయికి చేరువైన సెన్సెక్స్.. చివరికి 378.18 పాయింట్ల లాభంతో 80,802.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126.20 పాయింట్ల వృద్ధితో 24,698.85 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పాటు ముడి చమురు ధరల తగ్గుదల కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.46 లక్షల కోట్లు పెరిగి రూ.456.7 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 25 లాభపడ్డాయి.
సరస్వతి శారీ డిపో బంపర్ లిస్టింగ్
గతవారం పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను పూర్తి చేసుకున్న సరస్వతి శారీ డిపో లిమిటెడ్ మంగళవారం షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.160తో పోలిస్తే, బీఎస్‌ఈలో కంపెనీ షేరు 25 శాతం ప్రీమియంతో రూ.200 వద్ద లిస్టయింది. ఆ తర్వాత మరింత పుంజుకుని 31.21 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ స్థాయి రూ.209.95కు చేరకుంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.831.40 కోట్లుగా నమోదైంది.