Share News

23,350 స్థాయి కీలకం

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:06 AM

నిఫ్టీ గత వారం ప్రారంభంలో 730 పాయింట్ల లాభంతో 23,300 వరకు వెళ్లినా మంగళవారం బేరి్‌షగా మారి 2,000 పాయింట్ల భారీ నష్టంతో 21,300 వరకు దిగజారింది.

23,350 స్థాయి కీలకం

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,310, 23,350

మద్దతు : 23,200, 23,120

నిఫ్టీ గత వారం ప్రారంభంలో 730 పాయింట్ల లాభంతో 23,300 వరకు వెళ్లినా మంగళవారం బేరి్‌షగా మారి 2,000 పాయింట్ల భారీ నష్టంతో 21,300 వరకు దిగజారింది. కాని తదుపరి మూడు రోజుల్లో మంచి రికవరీ సాధించి చివరికి గత వారంతో పోల్చితే 760 పాయింట్ల లాభంతో 23,300 సమీపంలో జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ముగిసింది. మార్కెట్‌ గత వారం టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌ అనంతరం ఈ కీలక స్థాయిలో నిలదొక్కుకోవడం పాజిటివ్‌ ట్రెండ్‌ సంకేతం. మిడ్‌క్యాప్‌-100 సూచీ ఇంట్రాడేలో 4,400 పాయింట్లు నష్టపోయినా చివరికి 1,500 పాయింట్ల లాభంతో ముగియగా స్మాల్‌క్యాప్‌-100 సూచీ 520 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ ఈ వారంలో అప్రమత్త ధోరణిలో ప్రారంభమై గత వారం గరిష్ఠ స్థాయి 23,300 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: గత వారం ఆకస్మికంగా బలమైన బౌన్స్‌బ్యాక్‌ సాధించినందు వల్ల గరిష్ఠ స్థాయిలో కన్సాలిడేషన్‌ ఏర్పడవలసి ఉంది. పాజిటివ్‌ ట్రెండ్‌ ఏర్పడినట్టయితే నిరోధ స్థాయి 23,350 కన్నా పైన నిలదొక్కుకోవాల్సి ఉంది. ఆ పైన మరిన్ని కొత్త శిఖరాలకు ప్రయాణం సాగిస్తుంది. మానసిక అవధి 23,550.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ గత వారం 23,000 పాయింట్లను దాటినందు వల్ల సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాల్సి ఉంది. విఫలమైతే బలహీనతకు ఆస్కారం ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 22,700, 22,450.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 5,000 పాయింట్ల మేరకు ఇంట్రా వీక్‌ కరెక్షన్‌ సాధించినా బౌన్స్‌బ్యాక్‌ సాధించి చివరికి 820 పాయింట్ల లాభంతో 49,900 వద్ద ముగిసింది. 50,000 పాయింట్ల వద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది. ఆ పైన నిలదొక్కుకున్నట్టయితే నిరోధ స్థాయిలు 50,600, 51,200. బలహీనపడితే ప్రధాన మద్దతు స్ఝాథయి 49,000.

పాటర్న్‌: మార్కెట్‌ గత వారం కీలకమైన 100, 200 డిఎంఏల వద్ద రికవరీ సాధించింది. మరోసారి ఓవర్‌బాట్‌ స్థితిలో ప్రవేశించబోతోంది. 23,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి మద్దతు ఉంది. అప్‌ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉంది.

Updated Date - Jun 10 , 2024 | 04:06 AM