Share News

22,400 ఎగువకు నిఫ్టీ

ABN , Publish Date - May 17 , 2024 | 04:21 AM

రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో దాదాపు ఒక శాతం వరకు పెరిగాయి. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌...

22,400 ఎగువకు నిఫ్టీ

సెన్సెక్స్‌ 676 పాయింట్లు జంప్‌

ముంబై: రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో దాదాపు ఒక శాతం వరకు పెరిగాయి. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌ 676.69 పాయింట్ల లాభంతో 73,663.72 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 203.30 పాయింట్ల వృద్ధితో 22,403.85 వద్ద ముగిసింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గడంతో ఈ ఏడాది ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను కనీసం రెండు సార్లైనా తగ్గించవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. దాంతో గ్లోబల్‌ మార్కెట్లతో పాటు సెన్సెక్స్‌, నిఫ్టీ కూడా ర్యాలీ తీశాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 25 లాభపడ్డాయి.


22 నుంచి ఆఫీస్‌ స్పేస్‌ ఐపీఓ: కో-వర్కింగ్‌ సేవల కంపెనీ ఆఫీస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ఈనెల 22న ప్రారంభమై 27న ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.364-383గా నిర్ణయించింది. తద్వారా రూ.599 కోట్ల వరకు సమీకరించనుంది.

Updated Date - May 17 , 2024 | 04:21 AM