Share News

టెల్కోలకు అచ్చిరాని 2024

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:51 AM

ఈ సంవత్సరం (2024) దేశంలోని మూడు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. 5జీ సేవల విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రమ్‌ కొనుగోలు కోసం కంపెనీలు దాదాపు రూ.70,200 కోట్లు ఖర్చు చేశాయి. లాభాలు కాపాడుకోవడంతో పాటు...

టెల్కోలకు అచ్చిరాని  2024

బెడిసికొట్టిన టారిఫ్స్‌ పెంపు వ్యూహం

గుడ్‌బై చెప్పిన 2.6 కోట్ల చందాదారులు

పొంచి ఉన్న ‘శాట్‌కామ్‌’ పోటీ

భారంగా మారిన పెట్టుబడులు

ఈ సంవత్సరం (2024) దేశంలోని మూడు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. 5జీ సేవల విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రమ్‌ కొనుగోలు కోసం కంపెనీలు దాదాపు రూ.70,200 కోట్లు ఖర్చు చేశాయి. లాభాలు కాపాడుకోవడంతో పాటు ఇందులో కొంతైనా రాబట్టుకునేందుకు ఈ ఏడాది జూలై నుంచి టారి్‌ఫలను 10 నుంచి 26 శాతం వరకు పెంచాయి. ఈ బాదుడు భరించలేక దాదాపు 2.6 కోట్ల మంది చందాదారులు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు గుడ్‌బై చెప్పారు. వీరిలో 68 లక్షల మంది టారి్‌ఫలు ఏ మాత్రం పెంచని ప్రభుత్వ రంగ సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్‌కు మారిపోయారు. బీఎ్‌సఎన్‌ఎల్‌ ఇంకా 3జీ సేవలు అందించడంతో పాటు త్వరలో 4జీ సేవలకు సిద్ధం కావడం ఇందుకు ప్రధాన కారణం.


పెట్టుబడులు తప్పవు: చందాదారులు గుడ్‌బై చెబుతున్నా ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు కొత్త పెట్టుబడులు తప్పేలా లేవు. లేకపోతే మార్కెట్లో కొనసాగడం కష్టంగా మారనుంది. 5జీ సేవల విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఈ సంస్థలు 2022-27 మధ్య కాలంలో రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ (డీఐపీఏ) డైరెక్టర్‌ జనరల్‌ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ అంచనా.


శాట్‌కామ్‌ సంస్థల నుంచి పోటీ: ఇప్పటి వరకు దేశంలోని టెలికాం, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలపై రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలదే గుత్తాధిపత్యం. వచ్చే ఏడాది నుంచి ఈ సంస్థలకు ఎలాన్‌ మస్క్‌ నాయకత్వంలోని స్టార్‌లింక్‌ వంటి ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్‌ (శాట్‌కామ్‌) సంస్థల నుంచి ముఖ్యంగా డేటా బిజినె్‌సలో తీవ్ర పోటీ ఎదురు కానుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థలకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను వేలం లేకుండా ట్రాయ్‌ సిఫారసు చేసిన ధరకు కేటాయిస్తామని ప్రకటించింది. ఇది అన్యాయమని టెల్కోలు గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. ఈ శాట్‌కామ్‌ల సేవలు ప్రారంభమైతే డేటా బిజినె్‌సతో పాటు మారుమూల ప్రాంతాల్లోని జనాభాకు సైతం నిరంతరం టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో మరో విడత టెలికాం రంగంలో టారి్‌ఫల యుద్ధం ప్రారంభమై వొడాఫోన్‌ ఐడియా వంటి సంస్థల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.


బీఎ్‌సఎన్‌ఎల్‌లో మరో వీఆర్‌ఎస్‌!

ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌లో మరో విడత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎ్‌స)కు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న 55,000 మంది ఉద్యోగుల్లో 35 శాతం (సుమారు 18,000 -19,000) మందిని ఈ వీఆర్‌ఎస్‌ ద్వారా ఇంటికి పంపించాలని భావిస్తున్నారు. ఇందుకోసం రూ.15,000 కోట్లు కేటాయించాలని కోరుతూ టెలికాం శాఖ (డాట్‌) ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు సమాచారం. ప్రస్తుతం బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆదాయంలో 38 శాతం ఉద్యోగుల జీతభత్యాలకే పోతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వీఆర్‌ఎ్‌సకు ఆమోదం తెలిపితే ఏటా జీతాల కోసం చేసే రూ.7,500 కోట్ల ఖర్చు.. రూ.5,000 కోట్లకు తగ్గుతుందని భావిస్తున్నారు. 2019లో అమలు చేసిన వీఆర్‌ఎస్‌ ద్వారా బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన 93,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. అందుకోసం అప్పట్లో దాదాపు రూ.19,000 కోట్లు ఖర్చు చేశారు.

Updated Date - Dec 29 , 2024 | 04:51 AM