Share News

కాకినాడలో రూ.1,000 కోట్లతో ప్లాంట్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:16 AM

ఎరువుల తయారీ కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. ఆంధ్రప్రదేశ్‌, కాకినాడలోని తన ఎరువుల ఫ్యాక్టరీ వద్ద బ్యాక్‌వర్డ్‌ ఇంటిగ్రేషన్‌ చేపట్టింది...

కాకినాడలో రూ.1,000 కోట్లతో ప్లాంట్‌

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌

హైదరాబాద్‌: ఎరువుల తయారీ కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. ఆంధ్రప్రదేశ్‌, కాకినాడలోని తన ఎరువుల ఫ్యాక్టరీ వద్ద బ్యాక్‌వర్డ్‌ ఇంటిగ్రేషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా రూ.1,000 కోట్ల అంచనాతో ఫాస్పరిక్‌ యాసిడ్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. ఫాస్పరిక్‌ యాసిడ్‌ ప్లాంట్‌ రోజువారీ ఉత్పత్తి సామర్ధ్యం 650 టన్నులు, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంట్‌ రోజువారీ ఉత్పత్తి సామర్ధ్యం 1,800 టన్నులు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ రెండు ప్లాంట్ల నిర్మాణం రెండేళ్లలో పూర్తి కానుంది. డీఏపీ, ఎన్‌కేపీ ఎరువుల తయారీలో ఈ రెండు ఉత్పత్తులు కీలక ముడి పదార్ధాలు. కాకినాడ ప్లాంట్‌కు అవసరమైన ఫాస్పరిక్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ అవసరాల్లో ఈ రెండు ప్లాంట్లు 50 శాతం తీరుస్తాయని అంచనా.

Updated Date - Apr 30 , 2024 | 06:16 AM