Share News

కోరమాండల్‌ నుంచి 10 కొత్త ఉత్పత్తులు

ABN , Publish Date - May 25 , 2024 | 05:50 AM

మురుగప్పా గ్రూప్‌నకు చెందిన ఎరువులు, క్రిమి సంహారక మందుల కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మరో 10 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పది ఉత్పత్తులు పంటలను ఆశించే

కోరమాండల్‌ నుంచి 10 కొత్త ఉత్పత్తులు

హైదరాబాద్‌: మురుగప్పా గ్రూప్‌నకు చెందిన ఎరువులు, క్రిమి సంహారక మందుల కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మరో 10 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పది ఉత్పత్తులు పంటలను ఆశించే క్రిమికీటకాలను, వ్యాధులను నివారించి ఉత్పాదకత పెంచేందుకు ఎంతగానో సహాయ పడతాయని కంపెనీ తెలిపింది. ఇందులో ఒకటి వేప ఆధారిత జీవన ఎరువు. ఇది పంటల సంరక్షణతో పాటు భూసారాన్నీ పెంపొందిస్తుంది. జపాన్‌ కంపెనీ ఐఎస్‌కేతో కలిసి ప్రచండ పేరుతో ఒక పేటెంటెడ్‌ మందును కూడా కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది వరి పంట ఉత్పాదకతను 70 శాతం వరకు దెబ్బతీసే కాండాన్ని తొలిచే పురుగు, ఆకు ముడత తెగుళ్లకు సమర్ధవంతంగా పని చేస్తుంది. దీనికి తోడు మొక్కజొన్న రైతులను తీవ్రంగా ఇబ్బందిపెట్టే కత్తెర పురుగులకు కూడా ప్రచండ క్రిమిసంహారక మందు చక్కగా ఎదుర్కొంటుంది.

Updated Date - May 25 , 2024 | 05:50 AM