Share News

ఈ ఏడాది వేతనాల్లో 10% వృద్ధి: మెర్సర్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:20 AM

ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సంవత్సరం కూడా మన దేశంలో ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అన్ని రంగాల్లో ఈ పెరుగుదల సగటున 10 శాతం వరకు ఉంటుందని మెర్సర్‌...

ఈ ఏడాది వేతనాల్లో 10% వృద్ధి: మెర్సర్‌

న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సంవత్సరం కూడా మన దేశంలో ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అన్ని రంగాల్లో ఈ పెరుగుదల సగటున 10 శాతం వరకు ఉంటుందని మెర్సర్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది అర శాతం ఎక్కువ. ‘టోటల్‌ రెమ్యునరేషన్‌ సర్వే’ పేరుతో మెర్సర్‌ సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయం తెలిపింది. ఆటోమొబైల్‌, తయారీ, ఇంజనీరింగ్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల జీతాల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. ‘ఇది భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు, సృజనాత్మకత, నైపుణ్యాలను సూచిస్తోంది’ అని సర్వే తెలిపింది.

Updated Date - Feb 28 , 2024 | 03:20 AM