Share News

AP News: ఇంటింటికీ రూ.5 వేలు.. ‘ఇందిరమ్మ అభయం’ ప్రకటించిన వైఎస్ షర్మిల

ABN , Publish Date - Feb 26 , 2024 | 07:39 PM

అనంతపురం: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ (Congress) మొదటి గ్యారంటీ ప్రకటించింది. ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని అన్నారు. అనంతపురం పట్టణంలో ఏపీసీసీ నిర్వహించిన ‘న్యాయ సాధన సభ’ భారీ బహిరంగ సభలో ఆమె ఈ ప్రకటన చేశారు.

‘‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసింది. మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక గ్యారెంటీ ఇస్తుంది. ఇంటింటికీ రూ.5 వేలు. పేద కుటుంబాలు నిర్భయంగా బ్రతికే పథకం ఇది. పేదరికం నిర్మూలన కోసం ఇందిరమ్మ అభయం. అసమానతలు తొలగింపు కోసం ఈ నూతన ఆలోచన చేశాం. ప్రతి ఇంటికి అండగా నిలబడేది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి మహిళ పేరుమీదే ఈ రూ.5 వేలు ఇస్తాం. ఇంటికి దైవం ఇల్లాలు. అందుకే మహిళలకు ఈ గ్యారెంటీ. మహిళ పేరు మీదనే చెక్కు ఇస్తాం. కాంగ్రెస్‌ హయాంలో దివంగత వైఎస్సార్ ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేశారు. మళ్ళీ రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో పది అడుగులు కూడా ముందుకు పడలేదు’’ అని వైఎస్ షర్మిల్ అన్నారు.

చంద్రబాబు, సీఎం జగన్‌లపై షర్మిల ఫైర్..

మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. వీరిద్దరి పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదని, పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు వేగంగా అభివృద్ధిలో దూసుకు పోతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కు నెట్టిన ఘనత చంద్రబాబు, జగన్‌ది అని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ‘‘ మొదటి 5 ఏళ్లు బాబు మోసం చేశాడు.. తర్వాత జగన్ అన్న మరో 5 ఏళ్లు మోసం చేశాడు. తిరుపతిలో నిలబడి మోదీ 10 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పాడు. అదే వేదికగా చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగాడు. కానీ అధికారంలో వచ్చాక చంద్రబాబు హోదా విషయాన్ని మరిచిపోయారు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు అని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు అన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రాన్ని నవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర చేస్తా అన్నాడు. హోదా అవసరం అన్న నోటితోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అన్నారు. హోదా జగన్‌తో సాధ్యమని నమ్మితే అధికారం అనుభవిస్తూ ఒక్క ఉద్యమం చేయలేదు. హామీ ఇచ్చినట్టుగా ఎంపీలు రాజీనామాలు కూడా చేయలేదు. ఢిల్లీలో దీక్షలు చేయలేదు. కనీసం కేంద్రాన్ని ఏనాడూ బెదిరించలేదు’’ అని షర్మిల అన్నారు’’ అని జగన్, చంద్రబాబుపై వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.

Updated Date - Feb 26 , 2024 | 07:59 PM