Share News

మీ సేవలు చాలు.. దయచేయండి!

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:09 AM

ఇక మీ సేవలు చాలు. దయ చేయండి. ప్రభుత్వానికి మీ సలహాలు అవసరం లేదు’ అంటూ వైసీపీ ప్రభుత్వం నియమించిన సలహాదారులందరిని సాధారణ పరిపాలన శాఖ తొలగించింది. కేవలం ఒక్క అర్డర్‌తో 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఉద్వాసన పలికింది.

మీ సేవలు చాలు.. దయచేయండి!

ఒక్క ఆర్డర్‌తో 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఉద్వాసన

రాష్ట్ర సహకార యూనియన్‌ చైర్మన్‌ రాఘవరెడ్డి రాజీనామా

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘ఇక మీ సేవలు చాలు. దయ చేయండి. ప్రభుత్వానికి మీ సలహాలు అవసరం లేదు’ అంటూ వైసీపీ ప్రభుత్వం నియమించిన సలహాదారులందరిని సాధారణ పరిపాలన శాఖ తొలగించింది. కేవలం ఒక్క అర్డర్‌తో 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఉద్వాసన పలికింది. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్‌కల్లాం, సీఎం నవరత్నాల సలహదారు ఎం.శామ్యూల్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి తదితరులు ఆ జాబితాలో ఉన్నారు. సజ్జల, జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్‌, కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్‌ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రుల పేషీలో పనిచేస్తున్న సిబ్బందిని వారివారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ సురేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల వద్ద ఉన్న ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌, స్టేషనరీలను ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అప్పచెప్పాలని సూచించారు. కాగా, రాష్ట్ర సహకార యూనియన్‌ చైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన తన రాజీనామాను కమిషనర్‌, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ్‌సకు పంపారు.

Updated Date - Jun 07 , 2024 | 07:45 AM