Share News

సీటు ఇవ్వాల్సిందే..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:10 AM

ప్రభుత్వ నిబంధనల మేరకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చేరాలంటే ఆన్‌లైన్‌ చేసుకోవాలి. తర్వాత జిల్లా అధికారులు జాబితాను విడుదల చేస్తారు.

సీటు ఇవ్వాల్సిందే..!

మద్దికెర, జూలై 4: ప్రభుత్వ నిబంధనల మేరకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చేరాలంటే ఆన్‌లైన్‌ చేసుకోవాలి. తర్వాత జిల్లా అధికారులు జాబితాను విడుదల చేస్తారు. అయితే పాఠశాలలో సీటు రాకపోవడంతో ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, తమ వారికి సీటు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెస్తుండడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. మద్దికెర కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు 6 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్‌ వరకు విద్య ఉంది. పాఠశాలలో మొత్తం 360 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది 6వ తరగతి ప్రవేశానికి 40 సీట్లుకు గానూ 140 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సీటు వచ్చిన విద్యార్థినులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి పాఠశాలలో చేర్పించుకుంటున్నారు. దీంతో సీటు రాని వారు నాయకులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొంత మంది ఫోన్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. మాకు ఎలాగైనా సీట్లు ఇవ్వాల్సిందేనని భీష్మించడంతో అధికారులకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కస్తూర్బాలో అదనంగా 6వ తరగతి ప్రవేశాలకు ఎవరైనినైనా తీసుకోవాలంటే కలెక్టర్‌ ఉత్తర్వులు తప్పనిసరి. దీంతో తామేమీ చేయలేమని చెబుతున్నారు. జిల్లా అఽధికారులు స్పందించి కస్తూర్బాలో కొన్ని సీట్లు పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:10 AM