Share News

ప్రజారోగ్యాన్ని కుప్పకూల్చింది మీరే

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:36 AM

‘రాష్ట్రంలో ప్రజారోగ్యం కుప్పకూలిపోయిందని చెప్పడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మీ ఐదేళ్ల అనాలోచిత చర్యల వలన ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని మీకు తెలుసు.

ప్రజారోగ్యాన్ని కుప్పకూల్చింది మీరే

మీ హయాంలో అనారోగ్యం పాలైన శాఖ

జగన్‌కు మంత్రి సత్యకుమార్‌ కౌంటర్‌

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ప్రజారోగ్యం కుప్పకూలిపోయిందని చెప్పడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మీ ఐదేళ్ల అనాలోచిత చర్యల వలన ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని మీకు తెలుసు. కుప్పకూల్చి మీరే ప్రశ్నిస్తున్నారు’ అని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ మా జీ సీఎం జగన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. గుర్ల డయేరియా కేసు ల నేపథ్యంలో ప్రభుత్వంపై జగన్‌ ‘ఎక్స్‌’లో చేసిన విమర్శల కు ఆయన అదే వేదికపై ఘాటైన సమాధానం చెప్పారు. ‘మీ ప్రభుత్వం చేసిన తప్పులను మా ప్రభుత్వం సరిచేస్తుం టే కువిమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ డయేరి యా ప్రబలడానికి గల కారణం కలుషిత నీరు అన్న విషయం మీకు తెలియదా? ఆ నీరు కలుషితం కావడానికి మీరు గత ఐదు సంవత్సరాలు పైపులైన్ల నిర్వహణ చేపట్టకపోవడమే కారణమని మీకు తెలియదా? 104, 108 వ్యవస్థల్ని మీ ఆస్థాన కంపెనీ అరబిందోకు కమీషన్ల కోసం అం దించినప్పుడే ఆ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ బిల్లులు గత సంవత్సరం నుంచి మీరు చెల్లించకపోవడం వల్ల రూ.2,500 కోట్లు కొత్త ప్రభుత్వం మీద భారం పడింది. వైద్య కళాశాలల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల రూపంలో రూ.1,400 కోట్లు కొత్త ప్రభుత్వంపై భారం వేశా రు. నాడు-నేడు కింద కేంద్రం పీజీ సీట్లకు ఇచ్చిన రూ.750 కోట్లను దారి మళ్లించలేదా? నాసిరకం జగన్‌ బ్రాండ్‌ మద్యం తాగి మూత్రపిండాల, కాలేయం వ్యాధి బారినపడిన వారి సంఖ్య ఐదేళ్లలో 1,300 శాతం పెరగలేదా? చివరికి వైద్య శాఖ మీద కూడా దాదాపు రూ.5 కోట్ల అప్పు పెట్టిన ఘనత మీదే. కొత్త ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుతుంది. మీ హయాంలో అనారోగ్యం బారినపడిన శాఖ ను మళ్లీ ఆరోగ్యశాఖగా మార్చి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను, విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తుంది’ అని మంత్రి సత్యకుమార్‌ స్పష్టం చేశారు.

Updated Date - Oct 21 , 2024 | 03:38 AM