వైసీపీ తీరు హాస్యాస్పదం: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:10 PM
గత వైసీపీ ప్రభుత్వంలో పెంచిన విద్యుత చార్జీలను కూటమి ప్రభుత్వంపై నిందమోపుతూ ఆ పార్టీ నాయకులే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ అన్నారు.

నంద్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో పెంచిన విద్యుత చార్జీలను కూటమి ప్రభుత్వంపై నిందమోపుతూ ఆ పార్టీ నాయకులే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జగనను ఉద్దేశించి మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మీరు పెంచిన విద్యుత చార్జీలపై మీరు ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ చేస్తున్న ధర్నాలకు ప్రజల్లోనేకాకుండా సొంత పార్టీలోనే నాయకులు, కార్యకర్తలనుంచి ఎలాంటి స్పందన కనబడటం లేదని అన్నారు. అధికారం కోల్పోయి ఏం చేయాలో తోచక కూటమి ప్రభుత్వంపై బురదజల్లాలనే ఉద్దేశంతో వైసీపీ ఉందన్నారు. జగన విధ్వంసం చేసిన విద్యుతశాఖను సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారన్నారు. 22.5మిలియన యూనిట్ల కొరత ఉన్నా రాషా్ట్రన్ని 2019నాటికి మిగులు విద్యుత రాష్ట్రంగా తీర్చిదిద్దితే వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రూ.35వేల కోట్ల విద్యుతభారం మోపడమే కాకుండా రూ.1.20లక్షల కోట్ల నష్టాన్ని విద్యుతశాఖకు తెచ్చిపెట్టిందని అన్నారు. గుట్టుచప్పుడుకాకుండా డిస్కంలతో ప్రజలపై భారం వేయండని ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపింది మీ హయాంలో కాదా? అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుతశాఖలో జరిగిన అవకతవకలు, నష్టాన్ని సవరణ చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారన్నారు. ఏటా విద్యుత వినియోగం సగటున 6శాతం పెరుగుతోందని దానికి తగ్గట్టు విద్యుత ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడే వీటీపీఎస్, కృష్ణపట్నం జెనకో ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించామని, కానీ జగన్మోహనరెడ్డి వాటిని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జగన చేసిన పెద్ద పొరపాటు పీపీఏలను రద్దు చేయడమని, వాటి రద్దువల్ల 8వేల మెగావాట్ల విద్యుతను రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఆ 8వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుతను సీఎం చంద్రబాబునాయుడు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క మెగా వాట్ కూడా విద్యుదుత్పత్తి చేయలేదని అన్నారు. రాషా్ట్రనికి జగన చేసినంత నష్టాన్ని ఏ పార్టీ నాయకుడు చేయలేదని మండిపడ్డారు.