వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్టు
ABN , Publish Date - Nov 07 , 2024 | 04:58 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకట రామిరెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
వెంకటరామిరెడ్డికి 14 రోజుల రిమాండ్
మార్ఫింగ్ ఫొటోలతో బాబు, రఘురామపై పోస్టులు
గుంటూరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకట రామిరెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను గుంటూరు ఎక్సైజ్ కోర్టులో హాజరు పరచగా మేజిరేస్టట్ స్రవంతి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను జిల్లా జైలుకు తరలించారు. కేసు వివరాలను విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ మీడియాకు వివరించారు. మేకా వెంకటరామిరెడ్డి గతంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికు ప్రధాన అనుచరుడుగా పనిచేశారు. ఆ తర్వాత వైిసీపీ అధిష్ఠానం ఆయనను వైసీపీ సోషల్ మీడియా గుంటూరు జిల్లా కన్వీనర్‌గా నియమించింది. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై గుం టూరుకు చెందిన మాగులూరి కోటేశ్వరరావు మంగళవారం నగరంపాలెం పోలీస్ ేస్టషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ కేసులో నగరంపాలెం పోలీసులు బుధవారం నిందితుడు మేకా వెంకట రామిరెడ్డిని అరెస్టు చేశారు. కాగా, మేకాకు నేర చరిత్ర ఉంది. టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో వెంకటరామిరెడ్డి నిందితుడు. ఎన్నికల సమయంలో నారా లోకేశ్ నామినేషన్ల కార్యక్రమంలో పా ల్గొన్న టీడీపీ కార్యకర్త బొమ్మనబోయిన బాల ఈశ్వర్‌ను చంపుతానని బెదిరించిన కేసులోనూ ఆయన నిందితుడు.
రూ.75 వేలు వేతనం ఇచ్చేవారు: ఇంటూరి రవికిరణ్
మరో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని.. నోటీసులు ఇచ్చి పంపించారు. నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టేందుకు గత ప్రభుత్వం తనకు నెలకు రూ.75వేలు వేతనం ఇచ్చిందని, ఫైబర్ నెట్ ద్వారా నాడు చెల్లింపులు చేసేవారని పోలీసులకు ఆయన తెలిపినట్టు సమాచారం. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్న సమయంలో, 2019లో సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో గుడివాడకు చెందిన ఇంటూరి రవికిరణ్ నిందితుడు.