వైసీపీ పాలన అవినీతిమయం
ABN , Publish Date - May 12 , 2024 | 03:55 AM
వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలే రాజ్యమేలుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆరోపణ
తిరుపతి(ఆంధ్రజ్యోతి)/ఆదోని, మే 11: వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలే రాజ్యమేలుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో కలసి తిరుపతిలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ కూటమి విజయం తథ్యమనిపిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ తిరుపతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని నడ్డా దర్శించుకున్నారు. కాగా, కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. భారత దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే, ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో గ్యాస్ ధరలు తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఓటు అనే వజ్రాయుధంతో జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలని.. అప్పుడే ఏపీకి న్యాయం జరుగుతుందని నడ్డా పేర్కొన్నారు.