Share News

వైసీపీనే అంటార్రా... వ్యాన్‌తో తొక్కించేస్తాం!

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:53 AM

‘మేం రెడ్డిగారి అబ్బాయిలం. మాకు కోపమెక్కువ. ప్రభుత్వం మాది. నేను జగన్మోహన్‌రెడ్డికి ప్రియ శిష్యుడిని. నా పేరు రాంరెడ్డి. మా ప్రభుత్వాన్ని,

వైసీపీనే అంటార్రా... వ్యాన్‌తో తొక్కించేస్తాం!

సీఎంకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నార్రా

పేద బ్రాహ్మణ కుటుంబానికి వైసీపీ నేతల బెదిరింపులు

రాజమహేంద్రవరం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘మేం రెడ్డిగారి అబ్బాయిలం. మాకు కోపమెక్కువ. ప్రభుత్వం మాది. నేను జగన్మోహన్‌రెడ్డికి ప్రియ శిష్యుడిని. నా పేరు రాంరెడ్డి. మా ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను రకరకాలుగా మాట్లాడుతున్నారట. జగన్మోహన్‌రెడ్డిని అంటార్రా.. ఏ...(బూతులు). సీఎంకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నార్రా. మా సీఎం ఓడిపోవాలని అంటున్నారంట నా....(బూతులు). రోడ్లమీద వ్యాన్‌తో తొక్కించేస్తాం. స్పాట్‌లోనే చచ్చిపోతారు’ అని పేద బ్రాహ్మణ కుటుంబంపై ఓ వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. మహిళ అనే విచక్షణ లేకుండా అసభ్య పదజాలంతో చెలరేగిపోయాడు. ఒడిశాకు చెందిన మహాపాత్ర శివ కుటుంబం రాజమహేంద్రవరంలో వంటబ్రాహ్మణ వృత్తితో జీవనోపాధి పొందుతోంది. సోమవారం రాత్రి శివ భార్య ఫోన్‌కి 9133638139 నుంచి కాల్‌ వచ్చింది. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామంటూ ఫోన్‌ చేసిన వ్యక్తి ఇద్దరినీ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో బాధితులు సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌(వాసు)ను ఆశ్రయించారు. మంగళవారం బాధితులతో కలిసి ఎస్పీ జగదీశ్‌ని కలిసిన వాసు... బెదిరింపులకు దిగినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు.

ఒత్తిడి తెచ్చి చెప్పించేశారు

ఆలయంలో పైపై రాజీ ఎలా జరగాలో అధికారులకు ముందుగానే నిర్దేశించిన ఎమ్మెల్యే ద్వారంపూడి... చివరకు బాధిత అర్చకులపైనా బలవంతంగా ఒత్తిడి తెచ్చి అసలు వివాదం ఏమీ లేదని వారితోనే చెప్పించారు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం వారితో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించారు. జరిగిన ఘటన పూజారికి, భక్తుడికి మధ్య చోటుచేసుకున్న చిన్న వివాదంగానే చూడాలని చెప్పించారు. ఒకరకంగా చెప్పాలంటే బాధితులైన అర్చకులకు న్యాయం జరగకుండానే... వివాదం ఏం లేదని, అంతా చక్కబడినట్లేనని అధికార పార్టీ నేతలు తిరిగి వారితోనే బలవంతంగా చెప్పించారు. అధికారులు సైతం వైసీపీ నేతలకు కొమ్ముకాశారనే విమర్శలు వస్తున్నాయి. దాడి చేసిన వైసీపీ నేత చంద్రరావును అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన బయటే తిరుగుతుండటం ఉత్తుత్తి రాజీకి నిదర్శనంగా నిలిచింది.

Updated Date - Mar 27 , 2024 | 07:57 AM