Share News

ఉనికి కోసమే వైసీపీ ఆరాటం

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:38 PM

ఉనికి కోసమే వైసీపీ ఆరాట పడుతుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌ రెడ్డి ద్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంతంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు.

ఉనికి కోసమే వైసీపీ ఆరాటం
పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంతంలో వృద్ధురాలికి పింఛను డబ్బు అందజేస్తున్న ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఉనికి కోసమే వైసీపీ ఆరాట పడుతుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌ రెడ్డి ద్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంతంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీని గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. తొమ్మిది సార్లు విద్యుత చార్జీలు పెంచటానికి కారణం వైసీపీ అధినేత జగన అన్నారు. ఽవైసీపీ నాయకులు ఆందోళనలు చేయాలనుకుంటే చార్జీలు పెరగటానికి కారణమైన జగన ఇంటి ముందు ధర్నాలు చేయాలన్నారు. దాన్ని మరచి ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేయటమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నాయుడు దశలవారిగా అమలు చేస్తారని ఇందులో ఎలాంటి సందేహాం అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీమేరకు పింఛను పెంచటమే కాకుండా ప్రతినెల ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు.

ఫ ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే:

మారెమ్మ కొండ ప్రాంతంలో పింఛన్లు పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆ ప్రాంతంలో ఉన్న మండల పరిషత ఆదర్శ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను స్థానిక హెచఎంను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, మంచి భోజనం పెడుతున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు మరుగుదొడ్డి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పాఠశాల సమీపంలో కొండ పక్కను ఉన్న స్థాలాన్ని అధికారులతో పరిశీలించారు. స్థలాన్ని సర్వే చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. ఎమ్మెల్యే వెంట కమిషనర్‌ గంగిరెడ్డి, ఎంఈవో మధుసూదనరాజు, టీడీపీ వార్డు ఇనచార్జీ అల్తాఫ్‌, నాయకులు వీరేష్‌, రామకృష్ణ నాయుడు, మల్లయ్య, నవాజ్‌, షాలేమ్‌, ఇసాకు, అమాన, వాహీద్‌, వహాబు, రఫీక్‌, ఈరన్న, కృష్ణ, రామకృష్ణ, బీజేపీ నాయకులు నరసింహులు, శివ పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:38 PM