Share News

వైసీపీ పాపాలకు ప్రజల గుణపాఠం

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:12 AM

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పాపాలకు ప్రజలు గుణపాఠం చెప్పారని హిం దూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

వైసీపీ పాపాలకు ప్రజల గుణపాఠం

ఎన్నికల్లో నిశ్శబ్ద సునామీ సృష్టించారు: బాలకృష్ణ

హిందూపురంలో ఘనంగా జన్మదిన వేడుకలు

హిందూపురం, జూన్‌ 10: వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పాపాలకు ప్రజలు గుణపాఠం చెప్పారని హిం దూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తన 64వ జన్మదిన వేడుకలను సోమవారం ఆయన హిందూపురంలో నిర్వహించుకున్నారు. బాలకృష్ణకు పు ట్టిన శుభాకాంక్షలు చెప్పడానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్‌ ఆరోగ్య రథంను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉచిత అన్న క్యాంటిన్‌ను పునఃప్రారంభించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఐదేళ్లలో రోడ్లు దెబ్బతిన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఒక్క గుంతలోనూ తట్టెడు మట్టివేయని ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, మాట్లాడితే అణిచివేశారని తెలిపారు. ‘భయబ్రాంతులకు గురిచేశారు. బెదిరించారు. హత్యలు కూడా చేశారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలు విసుగు చెంది నిశ్శబ్ద సునామీ సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, కేసులు పెట్టడం, వేధించడం, మానసిక క్షోభకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగింది. హిందూపురం డిపోకు కేటాయించిన 20 కొత్త బస్సులను పుంగనూరుకు తీసుకెళ్లిన పాపాత్ముడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ అని మండిపడ్డారు. అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

Updated Date - Jun 11 , 2024 | 08:04 AM