ఇండియా కూటమిలోకి వైసీపీ!
ABN , Publish Date - Feb 18 , 2024 | 03:50 AM
ఇండియా కూటమిలో చేరటానికి వైసీపీ నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. శనివారం కర్నూలులో ఆయన
ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తాం: తులసిరెడ్డి
కర్నూలు(అర్బన్), ఫిబ్రవరి 17: ఇండియా కూటమిలో చేరటానికి వైసీపీ నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. శనివారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, వైసీపీని దూరం పెడుతున్నట్లు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమిలోకి చేరుతుందా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ‘రాష్ట్రానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి వాటితో పాటు రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన, వైసీపీ పాకులాడుతున్నాయి. ఇలాంటి పార్టీలకు ఓటు వేస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ సేవలు అవసరం. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారు’ అని తులసిరెడ్డి పేర్కొన్నారు.