Share News

మెగా డీఎస్సీ పేరిట వైసీపీ సర్కారు దగా

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:08 AM

మెగా డీఎస్సీ పేరిట వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను దగా చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు విమర్శించారు.

మెగా డీఎస్సీ పేరిట వైసీపీ సర్కారు దగా

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

మంగళగిరి, ఫిబ్రవరి 5: మెగా డీఎస్సీ పేరిట వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను దగా చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. తొలుత జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు డీఎస్సీ అభ్యర్థుల వినతిపత్రాన్ని పరిశీలించి సమస్యలను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు జనసేన కార్యాలయంలో డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడారు. డీఎస్సీ అభ్యర్థులు నాగబాబుకు తమ సమస్యలను తెలిపి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 25 వేల నుంచి 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ అభ్యర్థులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Feb 06 , 2024 | 04:08 AM