Share News

చంద్రబాబుపై వైసీపీ తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:20 AM

టీడీపీ అధినేత చంద్రబాబు పేదల వ్యతిరేకి అంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించిన ఆధారాలను

చంద్రబాబుపై వైసీపీ తప్పుడు ప్రచారం

సీఈవో మీనాకు వర్ల ఫిర్యాదు..48 గంటల్లోగా జవాబివ్వండి

ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మంత్రి జోగి రమేశ్‌కు ఈసీ నోటీసులు

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు పేదల వ్యతిరేకి అంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించిన ఆధారాలను గురువారం సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనాకు అందజేశారు. ‘‘పెనమలూరులో 80ఏళ్ల వృద్ధురాలి మరణానికి ప్రభుత్వమే కారణమైతే.. మంత్రి జోగి రమేశ్‌ శవ రాజకీయానికి ప్రయత్నించారు. చంద్రబాబు ఇంటి దగ్గర గోల చేయాలని నిర్లజ్జగా శవాన్ని కూడా అడుగుతున్నారు. గుడివాడలో కొడాలి నాని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి, పాత తేదీలతో 2వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆర్డీవోకి ఫోన్‌ చేసి, దబాయించారు. నందిగామలో రాజధాని గురించి ప్రశ్నించిన టీడీపీ సానుభూతిపరుడిని చంపేయమంటూ ఎమ్మెల్యే ప్రేరేపిస్తూ, దాడి చేయించారు. వీటిపై విచారించి, చర్యలు తీసుకోవాలని సీఈవోని వర్ల కోరారు. అనంతరం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని జోగి రమేశ్‌కు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అలాగే టీడీపీపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారంటూ వర్ల రామయ్య చేసిన మరో ఫిర్యాదుపైనా స్పందించిన ఈసీ... ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చింది.

Updated Date - Apr 05 , 2024 | 05:20 AM