టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్పొరేటర్ భర్త దాడి
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:10 AM
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్పొరేటర్ భర్త కత్తితో దాడి చేశాడు. దర్గామిట్ట పోలీసుల సమాచారం మేరకు..

నెల్లూరు(క్రైం), జూన్ 6: టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్పొరేటర్ భర్త కత్తితో దాడి చేశాడు. దర్గామిట్ట పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని వైఎ్‌సఆర్ నగర్‌కు చెందిన ఎస్‌కే అఖిల్, అతడి స్నేహితుడు ఎస్‌కే సులేమాన్ బుధవారం రాత్రి బైక్‌పై వెళుతుండగా ప్రగతినగర్ ప్రాంతంలో మస్తాన్ అనే వ్యక్తిపై కొందరు దాడి చేస్తున్నారు. దగ్గరకు వెళ్లి చూడగా 34వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఎస్‌కే రియాజ్, మరో నలుగురు ఆ దాడికి పాల్పడుతున్నారు. మస్తాన్ వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో అఖిల్, సులేమాన్‌ను చూసిన రియాజ్.. మీరిద్దరూ మస్తాన్ మనుషులేగా అంటూ అతడి వద్ద ఉన్న కత్తితో పొట్టలో, చేతిపై దాడి చేశాడు. దీంతో వారిద్దరికీ రక్తపుగాయాలయ్యాయి. రియాజ్ పరారయ్యాడు. బాధితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. రియాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.