Share News

పింఛన్ల పంపిణీపై వైసీపీ కుట్ర: సీపీఐ

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:39 AM

పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు.

పింఛన్ల పంపిణీపై వైసీపీ కుట్ర: సీపీఐ

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. పింఛన్ల పంపిణీ ఆలస్యానికి జగన్‌ సర్కార్‌, అధికార యంత్రాంగమే ఆధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు పింఛన్ల పంపిణీలో వలంటీర్లను వినియోగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తే... జగన్‌ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పింఛన్ల పంపిణీని ఆలస్యం చేస్తున్నాయని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి కుయుక్తులను రాష్ట్ర ప్రజలందరూ గ్రహించి రానున్న ఎన్నికల్లో తమ ఓటు ద్వారా జగన్‌ సర్కారుకు బుద్ధి చెప్పాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.

Updated Date - Apr 03 , 2024 | 07:18 AM